NEWSANDHRA PRADESH

ఏపీ టెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల

Share it with your family & friends

రిలీజ్ చేసిన మంత్రి నారా లోకేష్
అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగానే టెట్ కు సంబంధించి ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి కావాల్సిన ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష టెట్ ను నిర్వ‌హించింది. ఇదిలా ఉండ‌గా టెట్ -2024 ఫలితాలను ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష విడుదల చేశారు.

ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,68,661 మంది హాజరు అయ్యారు. ఇందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాలను https://cse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చ‌ని మంత్రి వెల్ల‌డించారు.

నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్ర‌క‌టించారు. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.