వైద్య..వ్యవసాయ రంగానికి ఆసరా
ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్
అమరావతి – ఏపీ వైసీపీ ప్రభుత్వం వైద్యం, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. బుధవారం శాసన సభలో ఆర్థిక శాఖ , శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి 2024-2025 సంవత్సరానికి సంబధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చినట్లు ఈ సందర్బంగా తెలిపారు ఆర్థిక మంత్రి. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల దాకా భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
ఇప్పటి వరకు 16,852 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక సీన్ మారిందన్నారు. ప్రధానంగా రైతులను ఆదుకునేందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 53 లక్షల 58 వేల మంది రైతులకు 33,300 కోట్ల రూపాయల మేర అన్నదాతలకు రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేసినట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా 10,778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశామన్నారు.
రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.. 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలు స్థాపించామని, తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వా హబ్‌గా తయారైందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.