ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
అమరావతి – పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు, ఏర్పాట్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి జిల్లా పరిపాలన, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వక్ఫ్ బోర్డ్ తరఫున లేఖ రాసినట్లు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ లకు, వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు రంజాన్ మాసానికి సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా ఆదేశించామన్నారు.
శుక్రవారం షేక్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య జాగ్రత్తలు, పారిశుధ్యం, భద్రతా ప్రమాణాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రార్థన మందిరాల్లో తగిన నీటి సౌకర్యం కల్పించేందుకు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూసేందుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు తెలిపారు.
ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం ప్రజానీకం కోసం దుకాణాలకు, కూరగాయల మార్కెట్లకు, హోటళ్లకు లేట్ నైట్ అనుమతులు అలాగే తెల్లవారుజామున తెరిచేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించాలని సర్కార్ ను కోరామన్నారు.