స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించి శనివారం తాడేపల్లి గూడెం కార్యాలయంలో మేని ఫెస్టోను విడుదల చేశారు. కేవలం ఇది 2 పేజీలు మాత్రమే ఉండడం విశేషం.
ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు. ఏపీ రాష్ట్రం అభివృద్ది సాధించాలంటే, అన్ని రంగాలలో ముందంజలో కొనసాగాలంటే తమ ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్నారు జగన్ రెడ్డి.
గతంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీని అభివృద్ది చేయడం జరిగిందని చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన 100 హామీలలో 99 హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు సీఎం. తమ పాలన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రధానంగా కరోనా ఇబ్బంది పెట్టిందన్నారు. అయినా ఎక్కడా తగ్గ లేదన్నారు జగన్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారినా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆప లేదన్నారు. ఇవాళ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది తమ సర్కార్ ఘనతేనని పేర్కొన్నారు.