Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHమ‌హిళా లోకం ప్ర‌పంచానికి ఆధారం

మ‌హిళా లోకం ప్ర‌పంచానికి ఆధారం

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – మ‌హిళ‌లు లేక పోతే ఈ ప్ర‌పంచమే ఉండ‌ద‌న్నారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా
జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళేన‌ని పేర్కొన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇవ్వాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.

మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేకుండా పోయింద‌ని ఆరోపించారు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని ధ్వ‌జ‌మెత్తారు పీసీసీ చీఫ్‌. వికసిత భారత్ లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు జ‌రిగాయ‌ని పోయారు. రోజుకి 80 మందిపై లైంగిక వేధింపులు జరగడం అత్యంత శోచనీయమ‌న్నారు. పేరుకే నారీశక్తి వందన్ అదినియమ్. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలదని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళల భద్రతపై ఎన్ని ఫాస్ట్ ట్రాక్ చట్టాలు ఉన్నా పేరుకు తప్పా.. ఆచరణలో శూన్యమ‌న్నారు.

ఇటు రాష్ట్రంలో సైతం మహిళలకు గౌరవం లేదని వాపోయారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గడిచిన 10 ఏళ్లలో 2 లక్షల వేధింపుల కేసులు నమోదు కావడం శోచ‌నీయ‌మ‌న్నారు. గత 5 ఏళ్లలో 25 శాతం అఘాయిత్యాలు పెరగడం దారుణ‌మ‌న్నారు. 54 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం బాధాక‌ర‌మ‌న్నారు. మహిళలపై దాడులలో ఆంధ్రప్రదేశ్ నెంబర్.1 గా ఉండటం సిగ్గుచేటు అన్నారు.

హింసకు కారణం అవుతున్న మద్యం, మత్తు పదార్థాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మరోవైపు మహిళా సాధికారిత అంటూ చేస్తున్నది కూడా మోసమేన‌ని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు , నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు లాంటి పథకాలు ఇస్తామని భ్ర‌మ‌ల్లో ఉంచార‌ని ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments