అధికారులను రిలీవ్ చేయొద్దు
ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆయా శాఖలకు సంబంధించి డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో రిలీవ్ చేయొద్దంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేసింది.
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో వీరిని నియమించింది. తాజాగా ప్రభుత్వం మారింది. కొత్త సర్కార్ కొలువు తీరనుంది. అప్పటి వరకు ఆయా శాఖలలో డిప్యూటేషన్లపై వచ్చిన వారు ఎవరో, ఏమేం చేశారనే దానిపై చంద్రబాబు కూటమి ఆరా తీయనుంది. ఈ మేరకు ఎవరినీ బదిలీ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని పేర్కొంది.
ఇదిలా ఉండగా రిలీవ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున డెప్యూటేషన్ పని చేస్తున్న వారంతా గంప గుత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక అప్లై చేసిన వారిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరరెడ్డి , గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరారు సమాచారశాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి –
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఉన్నారు.