రూ.24,276 కోట్లకు సీఆర్డీఏ ఆమోదం
వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి – సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 43వ సీఆర్డీఏ కీలక సమావేశం జరిగింది. ట్రంక్ రోడ్లు, లే అవుట్ లు , ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి రూ. 24 వేల 276 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అసెంబ్లీని 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు సీఎం . సమావేశాలు లేని సమయంలో ప్రజలు దర్శించుకునేలా చేస్తామని ప్రకటించారు.
ఈ కీలక సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. టవర్ పై నుంచి దర్శించుకునే సౌకర్యం కల్పిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. హైకోర్టును 20 లక్షల 32 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నామని ప్రకటించారు.
హై కోర్టు ఎత్తు 55 మీటర్ల నిర్మాణానికి రూ. 1048 కోట్లు ఖర్చవుతుందన్నారు. జిఏడి టవర్,హెచ్ వోడీల టవర్లు మొత్తం ఐదు నిర్మిస్తున్నామని తెలిపారు సీఎం. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు .
మొత్తం ఐదు టవర్ లకు రూ. 4,608 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరుకు దాదాపు అన్ని టెండర్లు ఖరారు అవుతాయని చెప్పారు. జనవరి నుండి రాజధాని నిర్మాణాలు పూర్తిస్ధాయిలో ప్రారంభిస్తామన్నారు.
ఇప్పటి వరకూ జరిగిన అధారిటీ మీటీంగ్ లలో 45వేల 249 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం రాజధాని నిర్మాణానికి 62 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అమరావతిపై వైసిపి చేసిన గందరగోళం తొలగించేందుకు 6 నెలలు పట్టిందన్నారు. వైసిపి నాయకులకు బురద జల్లడం తప్ప ఏమీ తెలియదన్నారు.