ఏపీపీసీసీ రెండో జాబితా వెల్లడి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తొలి విడతలో కొందరు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా తాజాగా రెండో జాబితాను ప్రకటించింది ఏఐసీసీ హై కమాండ్. కేంద్ర ఎన్నికల కమిటీ ఈ మేరకు పలువురు అభ్యర్థులను ఎంపిక చేసింది.
విశాఖపట్టణం లోక్ సభ స్థానానికి సత్య నారాయణ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. అనకాపల్లి ఎంపీ సీటుకు వేగి వెంకటేశ్ ను ఖరారు చేసింది. ఏలూరు లోక్ సభ స్థానానికి లావణ్య కుమారిని, తిరుపతి నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతా మోహన్ , నెల్లూరు లోక్ సభ స్థానానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పుల రాజు , నరసరావుపేట నుంచి అలెగ్జాండర్ సుధాకర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనకు మూడిందన్నారు. రాక్షస పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రస్తుతం ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కు పట్టం కడితే ప్రజా పాలన రానుందని చెప్పారు.