SPORTS

దేశం గ‌ర్వించేలా ప‌త‌కాల‌తో రండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఏపీ పీసీసీ చీఫ్

అమ‌రావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ వేదిక‌గా ఒలింపిక్స్ 2024 పోటీలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. ఆ దేశ ప్ర‌భుత్వం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భ‌ద్ర‌తను క‌ల్పించింది.

ప్ర‌పంచం న‌లు మూలల నుంచి పెద్ద ఎత్తున అథ్లెట్లు త‌మ దేశాల త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ మేర‌కు అక్క‌డికి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది ఫ్రాన్స్ స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా భార‌త దేశం త‌ర‌పున అథ్లెట్లు పారిస్ లో కొలువు తీరారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ప‌రేడ్ లో భార‌తీయ జాతీయ ప‌తాకాన్ని ధ‌రించారు. నాయ‌క‌త్వం వ‌హించారు తెలుగు వారి బిడ్డ పీవీ సింధు. ఆమె మువ్వొన్నెల జెండాను ధ‌రించి ముందుకు న‌డించారు. ఆమె వెనుక అథ్లెట్లు సాగారు.

పారిస్ ఒలింపిక్స్ లో జ‌రిగే పోటీల‌లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌త‌కాలు సాధించాల‌ని, దేశానికి పేరు తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.