ఏపీపీఎస్సీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్
విజయవాడ – తనను ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ కూటమి సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఒక పార్టీ అధ్యక్షురాలి మీద ఈ జులుం ఏంటి అంటూ మండిపడ్డారు. దీనిపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలన్నారు. ఏపీకి అమరావతి రాజధాని అని, దానిని తాను చూడాలని అనుకోవడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. కేపిటల్ సిటీ మీద రీసెర్చ్ చేయాలని అనుకుంటే మీకు ఎందుకు అంత భయం అని ఫైర్ అయ్యారు . రాజధానిపై కమిటీని తమ పార్టీ వేసిందన్నారు. కమిటీ తరపున విజిట్ చేయాలని అనుకున్నామని, అంతలోపే తనను గృహ నిర్భంధం విధించడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
అమరావతి మీద రీసెర్చ్ చేయాలని అనుకోవడం తప్పా అని ఏపీ సర్కార్ ను నిలదీశారు. ఒక కమిటీ వేస్తేనే మీకు ఇంత భయం ఎందుకని నిలదీశారు. అమరావతి రాజధాని లో ఏం దాచాలని అనుకుంటున్నారంటూ భగ్గుమన్నారు. పార్టీ ఆఫీసుకి వెళ్ళి అక్కడ యాక్షన్ ప్లాన్ డిస్కస్ చేద్దాం అనుకున్నామన్నారు. తమ ఆఫీసుకు వెళితే అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం అని ఫైర్ అయ్యారు. ఏం సాధించారని పీఎం మోదీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను డిమాండ్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు. వాటి మీద మాట్లాడే హక్కు తమకు లేదా అని పేర్కొన్నారు.