ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కడప వైఎస్సార్ జిల్లా – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ సునీత ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ వాపోయారు. మాజీ ఎంపీ , దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి గుండె పోటు వచ్చిందని చిత్రీకరించడం దారుణమన్నారు. ఆ సమయంలో వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త అక్కడ లేనే లేరని చెప్పారు. ఘటన జరిగినప్పుడు ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే వైఎస్ వివేకా కేసులో సాక్షులు ఒక్కరొక్కరుగా చని పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఈ దారుణ ఘటన జరుగుతోందని, దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే కీలక సాక్షులు లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి పవర్ లో ఉందని, అన్ని దర్యాప్తు సంస్థలు తమ చేతుల్లోనే ఉన్నాయని, సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. తక్షణమే తన సోదరి వైఎస్ సునీత ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వెంటనే సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు.