NEWSANDHRA PRADESH

ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం ష‌ర్మిల ఆగ్ర‌హం

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – రాష్ట్రంలో వ‌ర్షాల దెబ్బ‌కు అల్లాడి పోతుంటే ఏపీ స‌ర్కార్ ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. నేటికీ దాదాపు మూడు వారాలు అవుతోంది అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీట మునిగాయ‌ని అన్నారు.

రైతుల అర్తనాదాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయ‌ని వాపోయారు. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియ లేదా అంటూ చంద్ర‌బాబు నాయుడును నిల‌దీశారు. రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకు పోతున్నారని పేర్కొన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుందన్నారు. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది అంటూ నిల‌దీశారు.

బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసిందన్నారు. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదని ఆ ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుక‌ని అన్నారు. ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా..? మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేక పోతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టప రిహారం మీద ఇంకా స్పష్టత లేదన్నారు.