రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఎక్కడ చూసినా వర్షాల తాకిడితో సాధారణ ప్రజానీకంతో పాటు పంటలు సాగు చేసుకున్న రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన చెందారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే సభా సమావేశాలలో వారి గురించి ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రానికి అన్నదాతలే కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ .
భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను గుర్తించి, వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా యుద్ద ప్రాతిపదికన అంచనా వేసి పంటకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఈ సందర్బంగా తాను చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని చెప్పారు.