NEWSANDHRA PRADESH

ప్లీజ్ నాకు ర‌క్ష‌ణ క‌ల్పించండి

Share it with your family & friends

డీజీపీకి లేఖ రాసిన షర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఇటీవ‌లే పూర్తి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న స‌భ‌, సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ వెంట‌నే ఆమె ఎన్నిక‌ల రంగంలోకి దూకారు. దూకుడు పెంచారు. ఏపీ స‌ర్కార్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో త‌న‌కు కేటాయించిన సెక్యూరిటీని త‌గ్గించ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై దాడి చేసే ఛాన్స్ ఉంద‌ని పేర్కొన్నారు. ఇందులో భాగంగా త‌మ పార్టీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డికి ఎలా సెక్యూరిటీని త‌గ్గిస్తారంటూ మాజీ మంత్రి నీల‌కంఠాపురం ర‌ఘు వీరా రెడ్డి ప్ర‌శ్నించారు.

ఈ మేర‌కు ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతూ లేఖ రాశారు. డీజేపీ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. ఇదే స‌మ‌యంలో మంగ‌ళ‌వారం ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి తిరిగి త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ సుదీర్ఘ లేఖ రాశారు ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి.

ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంద‌న్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి డీజీపీకి టూర్ ప్లాన్ అంద‌జేశారు ష‌ర్మిలా రెడ్డి.