ఏపీపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో పర్యటించారు. ఆమెకు అడుగడుగునా జనం ఆదరించారు. ఈ సందర్బంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు వైఎస్ షర్మిల.
వైఎస్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, హంతకులకు టికెట్లు ఎలా కేటాయిస్తారంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా అసలు ఉన్నాడా , ఏనాడైనా ప్రజల వద్దకు వచ్చాడా అని నిలదీశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, సర్కార్ బేకార్ గా మారిందని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వసూలు రాజాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కడు ఒక్క పని చేయడం లేదంటూ ధ్వజమెత్తారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ జనానికి ఏమీ చేయనీయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .