Sunday, May 25, 2025
HomeNEWSANDHRA PRADESHగ్రూప్-2 మెయిన్స్ య‌థాత‌థం

గ్రూప్-2 మెయిన్స్ య‌థాత‌థం

త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్దు

అమరావతి – ఏపీపీఎస్సీ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసింది. త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని, గ్రూప్ -2 మెయిన్స్ ప‌రీక్ష య‌థాత‌థం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రీక్ష య‌థాత‌థంగా జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. అభ్య‌ర్థులు అపోహ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరింది. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది.

సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీపీఎస్సీ సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్స్​ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గ్రూప్​-2 పరీక్షలకు 92 వేల 250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లను మరిన్ని కట్టుదిట్టంగా చేశారు.

అభ్యర్ధులు ఉదయం 9.30 గంటలలోపు ఆయా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి. ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలలోగా ఆయా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి. మధ్యాహ్నం 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి, ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments