డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదన్నారు. సంఘటన స్థలంలో ఇది హత్య అనేందుకు చాలా రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్యేనని , కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరికీ అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలని, దోషులు ఎవరో తేల్చాలన్నారు.
ఇదిలా ఉండగా పాస్టర్ ప్రవీన్ పగడాల మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై స్పందించారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ కు ఫోన్ చేశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలన్నారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ మంత్రికి తెలిపారు. ప్రస్తుతం మృత దేహాన్ని సికింద్రాబాద్ కు తరలించారు.