అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలి
ఏపీ సర్కార్ ను డిమాండ్ చేసిన షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఆమె బహిరంగ లేఖను విడుదల చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అప్పనంగా అదానీ పరం చేశాడంటూ ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితేనే కానీ అసలు వాస్తవాలు బయటకు రావన్నారు.
ప్రధానంగా జగన్ రెడ్డి లోపాయికారి చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై పెను భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. దీని వల్ల వేల కోట్ల సంపద అదానీ పరం అవుతుందని మండిపడ్డారు. దీనికి కారణం కేంద్ర సర్కార్ తో పాటు అప్పటి సీఎం జగన్ రెడ్డి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ హయాంలో ఏపీలో అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
అక్రమ డీల్ కారణంగా 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ. 1.50 లక్షల కోట్లు అని తెలిపారు. ఈ డీల్ రద్దు చేయాలని ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు.