ప్రకటించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. అకారణంగా తొలగించిన 2 వేల మంది కార్మికులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల కోసం దీక్ష చేస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
పోలీసులు ఎందుకు తనను అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు. తాము తమ ప్రయోజనాల కోసం దీక్ష చేయడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే నేరంగా మారిందన్నారు.
కార్మికుల పక్షాన పోరాటం చేయడం నేరమా అని నిలదీశారు కూటమి సర్కార్ ను. అన్యాయంగా 2 వేల మంది కార్మికులను తొలగిస్తే పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరూ పీఎం మోదీ సర్కార్ కు ఊడిగం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
ఇంకో 3 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారంటూ ఫైర్ అయ్యారు. తమ హయాంలో స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచిందని, కానీ బీజేపీ సర్కార్ వచ్చాక నష్టాల్లోకి కూరుకు పోయిందన్నారు. ఆనాడు వైఎస్సార్ పాలనలో ఒక వెలుగు వెలిగిందన్నారు. 2014 నుంచి ప్లాంట్ కు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ భూముల విలువ రూ. 4 లక్షలు కోట్లు అని అన్నారు.