NEWSANDHRA PRADESH

క‌రెంట్ ఛార్జీలు పెంచితే ఊరుకోం – ష‌ర్మిల

Share it with your family & friends

ఏపీ ప్ర‌జ‌లు తిర‌గ‌బడే రోజు త‌ప్ప‌క వ‌స్తుంది

అమ‌రావ‌తి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. క‌రెంట్ ఛార్జీలు పెంచేందుకు ప్లాన్ చేస్తోంద‌ని, ఇప్ప‌టికే సీఎం ఓకే చెప్పార‌ని త‌మ‌కు స‌మ‌చారం వ‌చ్చింద‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని, ఆరు హామీలు అట‌కెక్కాయ‌ని, ప‌ట్టించుకునే వారే లేర‌ని మండిప‌డ్డారు.

కూర‌గాయ‌ల నుంచి దిన‌స‌రి వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని, ఉపాధి క‌రువై అన్న‌మో రామ‌చంద్ర అంటున్నారని, ఇక ప‌దే ప‌దే వ‌స్తున్న తుపాను, వ‌ర‌ద‌ల కార‌ణంగా బ‌తుకులు ఆగ‌మై పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌రుణంలో ఆదుకోవాల్సిన‌, భ‌రోసా ఇవ్వాల్సిన స‌ర్కార్ తిరిగి వారిపై ప‌న్నుల భారం మోపడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

రూ.6 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చే
స్తుండ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. దాదాపు ఒకేసారి 40 శాతం విద్యుత్ ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిస్కంలకు ప్రభుత్వం బకాయిలు ఉందనే కారణంతో విద్యుత్ ఛార్జీల పెంపునకు శ్రీకారం చుట్టగా.. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించార‌ని మ‌రి ఇప్పుడు ఎలా పెంచుతారంటూ నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

విద్యుత్ ఛార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపొద్దని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు .