పీఎం మోదీ..షాపై నిప్పులు చెరిగిన షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏకి పారేశారు. ఇండియా నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడం వల్లనే ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి పూర్తిగా పీఎం బాధ్యత వహించాలన్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారంటూ ఆరోపించారు. ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తోందంటూ ధ్వజమెత్తారు. మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు పని చేయడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వాపోయారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత మోదీ, షాలేనని పేర్కొన్నారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ,అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీళ్లకు పాలన చేసే హక్కు లేదన్నారు. చౌకిదార్ మోడీ దేశానికి కాదు..కేవలం బీజేపీ కి మాత్రమేనంటూ మండిపడ్డారు. ఇది మనం దేశం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారంటూ మండిపడ్డారు.పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని, ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారని అన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఎందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేక పోయారంటూ నిలదీశారు వైఎస్ షర్మిల. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ఆరోపించారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరన్నారు.