నిప్పులు చెరిగిన ఆర్టీసీ చైర్మన్
అమరావతి – ఐదేళ్ల పదవీ కాలంలో జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదని, లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా అంచుకుకు నెట్టి వేశాడని ఆరోపించారు. తను చేసిన నిర్వాకానికి కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు చేసినా తీర్చలేని దుస్థితి నెలకొందన్నారు. రాను రాను రాష్ట్రాన్ని నడపడం ఇబ్బందిగా మారిందన్నారు. తెచ్చిన అప్పులు వడ్డీలకే సరిపోతోందని వాపోయారు.
జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేయగా, లక్షా 40 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందని, ఇప్పుడవి తమ ప్రభుత్వానికి గుది బండగా మారితే, ప్రజలకు శాపంగా పరిణమించాయని విరుచుకుపడ్డారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల కాలంలో జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ, ధాన్యం, ఫీజు రియింబర్స్ మెంట్ కు రూ.22 వేల కోట్లను సీఎం చంద్రబాబునాయుడు చెల్లించారన్నారు.
ఒక అసమర్థుడి పాలన వల్ల రాజ్యం ఎంతమేర నష్టానికి గురవుతుందో ఏపీని చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లడమే కాకుండా, అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయన్నారు.