సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్
25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటన
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది.
ఈ మేరకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు వెల్లడించింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా.. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేసిన ఈ కీలక ప్రకటనతో సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్రంలో నడిపే ఆర్టీసీ బస్సులలో మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు.
కానీ ఇవాళ చేసిన ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన రాష్ట్రంలోని సీనియర్లకు సంతోషాన్ని కలిగించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది.