ఏఆర్ రెహమాన్ భావోద్వేగం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంపోసర్
తమిళనాడు – ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం విడి పోతున్నట్లు భార్య సైరా బాను ప్రకటించడం, ఇందుకు ఓకే చెప్పడం జరిగి పోయింది. దేశ వ్యాప్తంగా ఈ ఇద్దరు విడి పోవడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా నిలిచింది.
ఈ సందర్బంగా బుధవారం ఎక్స్ వేదికగా అల్లా రఖా రెహమాన్ స్పందించారు. తాము ముప్పైకి చేరుకోవాలని అనుకున్నామని ,కానీ కాలం తామిద్దరి మధ్య విడి పోయేలా చేసిందని పేర్కొన్నారు. కానీ అన్ని విషయాలు కనిపించని ముగింపును కలిగి ఉంటాయని అన్నారు ఏఆర్ రెహమాన్.
విరిగి పోయిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుందని తీవ్ర భావోద్వేగంతో తెలిపారు. అయినప్పటికీ ఈ పగిలి పోవడంలో మేము అర్థాన్ని వెతుకుతామని స్పష్టం చేశారు.
విడి పోయిన ముక్కలు మళ్లీ వాటి స్థానాన్ని కనుగొనలేవు అని అన్నారు అల్లా రఖా రెహమాన్. సంయమనం పాటించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్.