ENTERTAINMENT

విడి పోయిన ఏఆర్ రెహ‌మాన్..సైరా బాను

Share it with your family & friends

29 ఏళ్ల త‌ర్వాత విడాకులు తీసుకున్న జంట

త‌మిళ‌నాడు – ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహమ‌న్ భార్య సైరా బాను విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సినీ రంగాన్ని ఈ ప్ర‌క‌ట‌న విస్తు పోయేలా చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందారు. దాదాపు 29 సంవ‌త్స‌రాల త‌ర్వాత విడాకులు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

రెహ‌మాన్ భార్య సైరా బానో తరపు న్యాయవాది వంద‌నా షా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనవ్వడమే విడి పోవడానికి ప్ర‌ధాన కారణమని తెలిపారు.టెన్షన్‌లు, కష్టాలు తమ మధ్య లేని పోని విభేదాలను సృష్టించాయని దంపతులు గుర్తించారు.

1995లో వివాహమైన రెహ‌మాన్, సైరా బానుకు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య మానసిక ప‌ర‌మైన ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌నే విడి పోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఒకరికొకరు గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట ఉద్రిక్తతలు, కష్టాలు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని స్ప‌ష్టం చేశారు.

ఏఆర్ రెహ‌మాన్ , సైరా బానుకు ఖ‌తీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.