ఏఆర్ రెహమాన్ కెరీర్ లో మరో మైలురాయి
హెచ్ఎంఎంఏకి రెండు నామినేషన్లు
తమిళనాడు – ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ విజేత అయిన ఏఆర్ తన సినీ సంగీత కెరీర్ లో మరో మైలు రాయిని జోడించారు. ఆయనకు 57 ఏళ్లు. మలయాళ చిత్రం ఆడుజీవితం – ది గోట్ లైట్ 2024 కోసం హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ (హెచ్ఎంఎంఏ) లో ఒకటి కాదు రెండు నామినేషన్లు అందుకున్నారు ఏఆర్ రెహమాన్.
అంతే కాకుండా సాంగ్ – ఫీచర్ ఫిల్మ్ , స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ (విదేశీ భాష) విభాగాల్లో నామినేట్ అయ్యాడు రెహమాన్. ఈ ఉత్తేజకరమైన వార్తను కొన్ని రోజుల క్రితం ది గోట్ లైఫ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా పంచుకున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ 2024 లో వచ్చిన సర్వైవల్ డ్రామాలోని పెరియోనే పాట సాంగ్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ చేయబడింది.దీనిని ఏఆర్ రెహమాన్ , రఫీక్ అహమ్మద్ రాశారు . ఈ పాటను జితిన్ రాజ్ పాడారు.
బ్లెస్సీ దర్శకత్వం వహించిన మనుగడ నాటకం నేపథ్య స్కోర్ కోసం ‘స్కోర్-ఇండిపెండెంట్ ఫిల్మ్ (విదేశీ భాష)” విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ సందర్బంగా ది గోట్ లైఫ్ టీం మొత్తం సంగీత స్వరకర్త అల్లా రఖా రెహమాన్ కు ధన్యవాదాలు , అభినదనలు తెలిపారు.