బీజేపీ ప్లాన్ బెడిసి కొట్టింది
పార్టీ మరింత బల పడింది
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ కాలం పాలు తీహార్ జైలులో గడిపారు. ముందస్తు బెయిల్ పొందారు. ఈ సందర్బంగా ఊహించని రీతిలో ఆప్ చీఫ్ కు ఘన స్వాగతం పలికింది దేశ రాజధానిలో.
తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తనను జైలులో పెట్టి ఆప్ సర్కార్ ను కూల్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుట్రలు పన్నారని కానీ వారి ప్లాన్ వర్కవుట్ కాలేదని స్పష్టం చేశారు.
ఎప్పటికైనా సత్యం గెలుస్తందని, నిజం ఏమిటనేది నిలకడగా బోధ పడుతుందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వాసులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని తాను కోరుకున్నానని, ఏ ఒక్కరు ఎలాంటి ఫిర్యాదు తనకు చేయలేదన్నారు.
ఉచిత కరెంట్, నీటి సరఫరా ఎప్పటి లాగే కొనసాగడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు అరవింద్ కే జ్రీవాల్. ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావించిన బీజేపీకి ఊహించని షాక్ తగిలిందని అన్నారు. ఆప్ మరింత బలపడిందన్నారు.