టెడ్ ఎక్స్ స్పీకర్ అర్చనా సురేష్
హైదరాబాద్ – కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో స్వచ్చంధ సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు టెడ్ ఎక్స్ స్పీకర్ , డైరెక్టర్ అర్చనా సురేష్. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి సేవలు అందించేందుకు ఎన్జీఓలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ లో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఏర్పాటు చేసిన సమావేశానికి అర్చనా సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎస్ఆర్ ద్వారా పంచాతీరాజ్ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చంధ సంస్థలకు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు అర్చనా సురేష్.
ఇందు కోసం ఎలాంటి కట్టుదిట్టమైన నిబంధనలు విధించకుండా నిధులు మంజూరు చేయాలని సూచించారు. ఇదే సమయంలో నిజాయితీ, నిబద్దతతో పని చేస్తున్న స్వచ్చంధ సంస్థలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్జీఓలకు సీఎస్ఆర్ చట్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు అర్చనా సురేష్.