రాప్ సింగర్ అరివు సెన్సేషన్
తళపతి విజయ్ ను మరిచి పోలేను
తమిళనాడు – దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు టీవీకే పార్టీ చీఫ్, తమిళ సూపర్ స్టార్ తళపతి విజయ్ . ఆయన తొలిసారి మహానాడు నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వచ్చారు. పది కిలోమీటర్లకు పైగా జనం నిలిచి ఉన్నారని టాక్. అంతే కాదు అనధికారిక వర్గాల సమాచారం మేరకు దాదాపు 10 లక్షల మంది ప్రజలు టీవీకే పార్టీ సభకు వచ్చి ఉంటారని అంచనా.
ఇక టీవీకే పార్టీ లోగో, సాంగ్ వైరల్ గా మారింది. కాగా పార్టీకి సంబంధించిన పాటను కంపోజ్ చేసే బాధ్యతను ప్రముఖ ర్యాప్ సింగర్ అరివుకు అప్పగించారు తళపతి విజయ్. ఈ సందర్బంగా పార్టీ మహానాడు లో ఈ సాంగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
దీంతో అంతులేని సంతోషానికి లోనవుతున్నాడు కంపోజర్, రైటర్ , సింగర్ అరివు. సోమవారం ఎక్స్ వేదికగా తళపతి విజయ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. నువ్వు మాత్రమే చేయగలవు అంటూ తనను ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్బంగా విజయ్ వాయిస్ ను రికార్డ్ చేయడం తన జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకమని పేర్కొన్నాడు అరివు.
సదస్సులో పార్టీలో విధాన గీతాన్ని కూడా విడుదల చేశారు. వెట్రి వెట్రి అంటూ మొదలయ్యే ఈ పాట పార్టీ విధానం గురించి తెలియ చెప్పింది. ఈ పాటను రాపర్ బిహూ స్వరపరిచారు. విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో వాతీ రైడ్ పాట పాడాడు.
నన్నే ఎందుకు ఎంచుకున్నారని అడుగగా నువ్వు మాత్రమే చేయగలవు అంటూ విజయ్ చెప్పిన విషయాన్ని తెలిపాడు రాపర్ అరివు.