నిప్పులు చెరిగిన ఒలింపియన్ బబూటా
పంజాబ్ – ప్రముఖ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఆరోపణలు చేశారు. కొద్ది నిమిషాల తేడాతో తను మెడల్ ను కోల్పోయాడు. పారిస్ ఒలింపిక్స్ నుంచి దేశానికి తిరిగి వచ్చిన బబూటా పంజాబ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తనకు సాయం చేస్తానని మాటిచ్చిన సీఎం భగవంత్ మాన్, మంత్రులు మరిచి పోయారని ఆరోపించారు. క్రీడాకారులకు, క్రీడలకు ప్రోత్సాహం దొరకడం లేదని వాపోయాడు. ఇలా అయితే ఎలా క్రీడాకారులు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారంటూ ప్రశ్నించాడు.
తను ప్రధానంగా సీఎం మాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆప్ సర్కార్ నుండి ఎలాంటి మద్దతు ఉండడం లేదన్నాడు. ఒలింపిక్స్ లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో, బాబుటా తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. 4వ స్థానంలో నిలిచాడు.
అర్జున్ బాబుటా తన కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా పంజాబ్ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం పొందలేదని వాపోయాడు. తను కెరీర్ లో ఎన్నో మెడల్స్ తీసుకు వచ్చానని, ఇకనైనా తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రకటించిన జాబ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు బబూటా.