అర్షద్ నదీమ్ అదుర్స్
పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం
పారిస్ – పాకిస్తాన్ కు చెందిన హర్షద్ నదీమ్ రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రో విభాగంలో జరిగిన పోటీలలో దుమ్ము రేపాడు. తన దేశానికి తొలి స్వర్ణం అందించాడు . భారత్ కు చెందిన నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టేసి తనకు ఎదురే లేదని చాటాడు అర్షద్ నదీమ్.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ దేశం 1992 ఒలింపిక్స్ తర్వాత ఒక్క పతకం కూడా గెలవలేదు. కానీ అర్షద్ నదీమ్ ఒక్కడే తన దేశం పరువు పోకుండా కాపాడాడు. ముందు నుంచి తను బంగారు పతకంపై గురి పెట్టాడు. ఎక్కడా తగ్గకుండా తాను తీసుకు పోవాలని నిర్ణయం చేసుకున్నాడు.
రేయింబవళ్లు శ్రమించాడు. తనకు ముందే తెలుసు ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని. కానీ అన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు. చివరకు విజేతగా నిలిచాడు అర్షద్ నదీమ్.
నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరంలో ఈటెను విరిసి రెండో స్థానంలో నిలిచాడు. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అర్షద్ నదీమ్ మాత్రం ఏకంగా 92.97 మీటర్ల దూరంలో బరిసెను విసిరి రికార్డు బ్రేక్ చేశాడు. దీంతో పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. ఆ దేశ ప్రధాని నదీమ్ ను అభినందించాడు.