ప్రభాస్ జోకర్ లాగా అనిపించాడు
అర్షద్ వార్సీ షాకింగ్ కామెంట్స్
ముంబై – నటుడు, ఫిలిం క్రిటిక్ అర్షద్ వార్షీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్ పై నోరు పారేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ మూవీ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఊహంచని దానికంటే అత్యధిక వసూళ్లు సాధించింది.
ఈ సందర్బంగా సినిమా విడుదలై రోజులైన తర్వాత అర్షద్ వార్షీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కల్కి మూవీలో నటించిన ప్రభాస్ ను ఆయన జోకర్ గా అభివర్ణించారు. ఆ సినిమాలో ఏం ప్రత్యేకత ఉందని ఆదరించారో తనకు తెలియ లేదన్నారు.
హిందూ ఇతిహాసం మహాభారతం నుండి ప్రేరణ పొందిన, ప్రభాస్ నటించిన డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం తనను ఆకట్టుకోలేక పోయిందన్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటన బాగున్నప్పటికీ ప్రభాస్ నటన వర్కవుట్ కాలేదని పేర్కొన్నారు అర్షద్ వార్షీ.
ఇదిలా ఉండగా పాన్ ఇండియా నటుడిగా పేరు పొందిన ప్రభాస్ పై అనుచిత కామెంట్స్ చేయడం పట్ల ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.