సింగ్ కమాల్ సఫారీలు ఢమాల్
20 పరుగులు 3 వికెట్లు
జోహనెస్ బర్గ్ – దక్షిణాఫ్రికాకు కోలుకోలేని షాక్ తగిలింది. కలలో కూడా ఊహించి ఉండదు ఆ జట్టు. తమను పిచ్చ కొట్టు కొడతారని. పరుగుల వరద పారిస్తారని. భారత క్రికెటర్లు ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయి ఆడుతుంటే చూస్తూ ఉండి పోయారు. క్రికెట్ పరిభాషలో ఉన్న షాట్స్ అన్నీ ఆడారు. ప్రధానంగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మలు ఓ వైపు కొట్టిన సిక్సర్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే సంజూ శాంసన్ కొట్టిన సిక్సర్ ఏకంగా గ్యాలరీలో కూర్చున్న మహిళా ఫ్యాన్ కు తగిలింది. ఆమెకు గాయమైంది. దీంతో తను మ్యాచ్ ముగిశాక పలకరించాడు. పరామర్శించి..ఆమె గాయానికి అయిన ఖర్చును తానే భరిస్తానని చెప్పాడు. ఈ సందర్బంగా ఆమెకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శాంసన్ 109 రన్స్ చేస్తే తిలక్ వర్మ 120 రన్స్ చేశాడు. అనంతరం భారీ లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన సౌతాఫ్రికాను తమ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ , అక్షర్ పటేల్. అర్ష్ దీప్ కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.