ఆత్మ బలం విజయానికి సోపానం
ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ రవి శంకర్
అమరావతి – ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ రవి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పర్యటించిన ఆయనను మర్యాద పూర్వకంగా కలుపుకున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమ రాజు.
ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు . నూతనంగా ఎన్నికైన ఉప సభా పతి ని అభినందించారు ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ రవిశంకర్. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీవితం పట్ల నియంత్రణ అనేది ముఖ్యమని స్పష్టం చేశారు ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని అన్నారు శ్రీశ్రీశ్రీ రవి శంకర్. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎలాంటి ఖర్చు అవసరం లేదని చెప్పారు.
దీనిని ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు జీవితం సుఖమయం కావడానికి మార్గం చూపుతుందని అన్నారు శ్రీశ్రీశ్రీ రవి శంకర్. ఈ ప్రక్రియను లక్షలాది మంది ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని, మరికొందరు దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందారని చెప్పారు.
“జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం అన్నారు. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుందని చెప్పారు. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదని అన్నారు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుంది అని హెచ్చరించారు.