అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ కార్యకర్తల దాడి
తీవ్రంగా ఖండించిన ఆప్ నేతలు సంజయ్..చద్దా
ఢిల్లీ – ఆప్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు ఆప్ సీనియర్ నేతలు సిసోడియా, సంజయ్ ఆజాద్ సింగ్ , చద్దా, అతిషి ఆరోపించారు.
త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాగూ ఓడి పోతామని తట్టుకోలేక ఆప్ నేతలపై దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ పై జరిగిన దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, కానీ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఆప్ నేతలు అసెంబ్లీ స్థానాలలో పాదయాత్రలు చేస్తున్నారు. ఆయనతో పాటు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తో పాటు మద్దతుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొంటున్నారు.
పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి లో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్బంగా కేజ్రీవాల్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ పార్టీ నేతలు ఆరోపించారు.