NEWSNATIONAL

సీబీఎస్ఈలో ఢిల్లీ స‌ర్కార్ స్కూళ్ల హ‌వా

Share it with your family & friends

గ‌త ఏడాది కంటే ఈసారి అత్య‌ధిక శాతం

న్యూఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో నిర్వ‌హించిన సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు సోమ‌వారం వెల్ల‌డి అయ్యాయి. ఈ సంద‌ర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వ ఆధీనంలోని ఢిల్లీ స‌ర్కార్ బ‌డులు అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించాయి. గ‌త ఏడాది కంటే ఈసారి మెరుగైన రిజ‌ల్ట్స్ రావ‌డం విశేషం.

ఈ సంద‌ర్బంగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌త్యేకంగా ఉత్తీర్ణ‌త సాధించిన స్కూళ్ల‌ను అభినందించారు. మెరుగైన ఫ‌లితాల‌ను తీసుకు రావ‌డంలో కృషి చేసిన పంతుళ్ల‌ను, అద్భుతంగా చ‌దువుకుని ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల‌ను, వారి త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం.

12వ త‌ర‌గ‌తి సీబీఎస్ఈ ప‌రీక్ష‌లో ఏకంగా ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు 96.99 శాతం అందుకోవ‌డం విశేషం. గ‌త సంవ‌త్స‌రం కంటే మ‌రో శాతం అద‌నంగా రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.
సీబీఎస్ఈ జాతీయ స‌గ‌టు శాతాన్ని కూడా అధిగ‌మించిన‌ట్లు పేర్కొన్నారు.

2022-23 సంవ‌త్సారికి సీబీఎస్ఈ ఫ‌లితాల‌లో ఢిల్లీ స్కూళ్లు 91.59 శాతం అందుకోగా, 2023-24 సంవ‌త్స‌రంలో 96.99 శాతం రావ‌డం అభినంద‌నీయం.