సుప్రీంకోర్టు తీర్పు భేష్ – కేజ్రీవాల్
కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ – చండీగఢ్ మేయర్ కు సంబంధించి తాజాగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేసిన నిర్వాకం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలో దీనిని సవాల్ చేస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్పొరేటర్ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతే కాదు బీజేపీ అభ్యర్థిగా మేయర్ ఎన్నిక చెల్లదంటూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
ఈ మేరకు ఆప్ కార్పొరేటర్ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆప్ బాస్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ఈ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.