బీజేపీ పనేనంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ – ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులు కేజ్రీవాల్ ను అంతం చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆప్ నేతలు ఆరోపించారు. దీనిని ఖండించింది బీజేపీ. కాన్వాయ్ కారు తమ పార్టీ కార్యకర్తలను ఢీకొట్టిందని, అందుకే దాడి చేయాల్సి వచ్చిందన్నారు పర్వీష్ వర్మ.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కావాలని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఢిల్లీలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇప్పటి వరకు రెండుసార్లు అధికారంలో కొనసాగింది అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. మరో వైపు జనరంజక హామీలను గుప్పించింది బీజేపీ. విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉచితంగా సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా గర్భీణలుకు రూ. 21,000 ఇస్తామన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.