28 వరకు కస్టడీకి కేజ్రీవాల్
స్పష్టం చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి 17 మందిని అదుపులోకి తీసుకుంది ఈడీ. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసింది. ఆమెకు కోర్టు కస్టడీ విధించింది. మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మద్యం పాలసీని రూపొందించడం, డబ్బులను ఎరగా చూపడం, వాటిని హవాలా రూపంలో తరలించడంలో కీలకమైన పాత్ర పోషించిందంటూ ఈడీ ఆరోపించింది.
ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరో కింగ్ పిన్ గా మారారంటూ ఈడీ సంచలన ఆరోపణలు చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై. ఇప్పటికే విచారణకు రావాలంటూ పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించు కోలేదని ఆరోపించింది.
దీంతో సెర్చ్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగింది ఈడీ. వెనువెంటనే సీఎం ఇంట్లోకి ప్రవేశించింది. ఆయనను అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరు పర్చింది. మార్చి 28 వరకు కస్టడీ విధించింది కోర్టు. దీంతో విచారణ ప్రారంభించింది ఈడీ. మొత్తంగా సీఎం కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని , రూ. 600 కోట్లకు పైగానే చేతులు మారాంటూ ఆరోపించింది.