స్వతంత్ర భారతంలో తొలి సీఎం
చరిత్ర సృష్టించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలనంగా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. అయితే స్వతంత్ర భారత దేశ చరిత్రలో అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు కేజ్రీవాల్. ఇవాళ ఊహించని రీతిలో సీఎం ఇంటికి ఈడీ వెళ్లింది. ఆయనను బలవంతంగా ఏజెన్సీ ఆఫీసుకు తీసుకు వెళ్లింది. ఇదే కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసింది. ఆమెకు ఏడు రోజుల కస్టడీ విధించింది.
ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించడంలో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవిత కీలకంగా వ్యవహరించారంటూ ఈడీ తన నివేదికలో పేర్కొంది. అయితే ఆప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి దేశ రాజధానిలో.
బీజేపీ, ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నారంటూ ఆరోపించింది ఆప్. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈడీ, సీబీఐ దాడులు చేసిందని కానీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేక పోయారంటూ వాపోయింది. ఆప్ మంత్రి అతిషి నిప్పులు చెరిగారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పార.
12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం సెర్చ్ వారెంట్ తో సీఎం ఇంటికి చేరుకుందన్నారు. మనీ లాండరింగ్ కింద ప్రశ్నించిందని, ఫోన్లను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.