ప్రజాస్వామ్యాన్ని బంధించ లేరు
నిప్పులు చెరిగిన సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఈ దేశంలో నియంతృత్వంతో పాలన సాగించాలని అనుకునే వారికి చెంప పెట్టు తనకు బెయిల్ రావడం అని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కుట్రలు, కుతంత్రాలతో ఆప్ ను లేకుండా చేయాలని చూశారని, కానీ వారి ఆటలు ఇక్కడ చెల్లవని తేల్చి చెప్పారని అన్నారు.
విడుదలైన అనంతరం ఆయన నగరంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. ఈ దేశం ప్రస్తుతం ప్రమాదంలో ఉందన్నారు. ఆ ప్రమాదం ఏమటింటే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి కేవలం తాము మాత్రమే ఉండాలని అనుకుంటున్నారని కొందరు. వారి పట్ల మనం అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కేజ్రీవాల్.
వాళ్లు అన్నింటిని మారుస్తామని అనుకుంటున్నారు. కానీ వారికి తెలియదు తాము ప్రమాదంలో ఉన్నామనే విషయం అంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చర్యలు తీసుకున్న మోదీకి, ఆయన పరివారానికి షాక్ ఇవ్వక తప్పదన్నారు. ఎళ్లకాలం ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరని గుర్తుంచు కోవాలన్నారు.