ఆప్ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టం
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
హర్యానా – ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హర్యానా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా హిసార్ నగరంలో జరిగిన ఆప్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఎత్తున జనం సాదర స్వాగతం పలికారు.
ఇవాళ హిసార్‌లో ఉన్న అభ్యర్థులందరిలో, అత్యంత నిజాయితీ, మంచి అభ్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సత్రోదియా అని పేర్కొన్నారు.
హర్యానాలో ఆప్ వాతావరణం నెలకొందని అన్నారు. తాను ముందు గానే జైలు నుంచి విడుదలై ఉంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉండేదన్నారు.
అయితే, ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆప్ లేకుండా ఏర్పడదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆ ప్రభుత్వం ద్వారా మీ పనులన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత నాదేనని ప్రకటించారు మాజీ సీఎం.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆప్ ను ఆదరిస్తున్నారని, దీనిని చూస్తుంటే తాము పవర్ లోకి రావడం ఖాయమని అనిపిస్తోందని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.