NEWSNATIONAL

దేశం కోసం జైలుకు వెళుతున్నా

Share it with your family & friends

కేజ్రీవాల్ కు రాజ్ దీప్ ప్ర‌శంస

న్యూఢిల్లీ – ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను అవినీతి ప‌రుడిన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ స‌ర్కార్ నిరూపించ లేక పోయింద‌ని అన్నారు. ఆయ‌నకు జారీ చేసిన మ‌ధ్యంత‌ర బెయిల్ ముగియ‌నుంది. దీంతో మ‌రోసారి జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది కేజ్రీవాల్ కు. త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ప‌రీక్ష‌లు చేయించు కోవాల్సి ఉంద‌ని, త‌న‌కు బెయిల్ గ‌డువు పొడిగించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు కేజ్రీవాల్ కోర్టులో.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం అభ్యంత‌రం తెలిపింది. అంత త్వ‌ర‌గా విచార‌ణ జ‌రిపే కేసు కాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఒక ర‌కంగా కేజ్రీవాల్ కు ఇది బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్ పై.

ఢిల్లీ సీఎం గ‌నుక అవినీతి ప‌రుడైతే ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ నిజాయితీప‌రులు కార‌ని పేర్కొన్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. అయితే దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఈ దేశాన్ని ర‌క్షించేందుకు న‌న్ను జైలుకు పంపించినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు.