ప్రకటించిన మాజీ సీఎం
ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ . ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 70 సీట్లకు గాను ఆప్ 23 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఈ సందర్బంగా కేజ్రీవాల్ స్పందించారు. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చిందని, అందుకే తాము ఓటమి పాలయ్యామంటూ పేర్కొన్నారు.
కాగా భారతీయ జనతా పార్టీ 47 స్థానాలలో విజయ కేతనం ఎగుర వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.
ఆప్ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ప్రధానంగా అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని కొంప ముంచేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరో వైపు బీజేపీ ప్రజల్లోకి వెళ్లడంలో సక్సెస్ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాషాయం సత్తా చాటింది.