బాబు మౌనం కేజ్రీవాల్ ఆగ్రహం
అంబేద్కర్ ను తీరని అవమానం
ఢిల్లీ – మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ గా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై ఎందుకు ప్రశ్నించ లేదని నిలదీశారు. ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. అంబేద్కర్ అవమానిస్తే చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. దీనిపై మీ వైఖరి ఏమిటో ప్రజలు తెలుసు కోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు మాజీ సీఎం.
అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన తెలియ చేయాలని లేఖలో పేర్కొన్నారు. బాబా సాహెబ్‌ను అవమానించిన అమిత్ షానే మోదీ సమర్థిస్తుండడం దారుణమన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ దేశంలో కోట్లాది మందికి అంబేద్కర్ ఆరాధ్య దైవమని స్పష్టం చేశారు. కానీ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అలా అనుకోవడం లేదన్నారు. వారు మను స్మృతిని నమ్ముతున్నారని, దానినే అమలు చేయాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. దీనిని ప్రజలు గమనిస్తున్నారని , రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.