NEWSNATIONAL

అభిషేక్ సింఘ్వీతో కేజ్రీవాల్ భేటీ

Share it with your family & friends

బెయిల్ వ‌చ్చేందుకు ఆయ‌నే కార‌ణం

న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆదివారం మ‌ర్యాద పూర్వ‌కంగా ప్ర‌ముఖ న్యాయ‌వాది డాక్ట‌ర్ అభిషేక్ సింఘ్వీతో భేటీ అయ్యారు. ఆయ‌న నివాసానికి త‌న స‌తీమ‌ణి సావిత్రీ కేజ్రీవాల్ తో క‌లిసి వెళ్లారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

ఇదిలా ఉండ‌గా అర‌వింద్ కేజ్రీవాల్ త‌ర\పున సుప్రీంకోర్టులో వాదన‌లు వినిపించారు. ఆయ‌న లేక పోతే త‌న‌కు బెయిల్ వ‌చ్చి ఉండేది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు అర‌వింద్ కేజ్రీవాల్. ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికించు కోవాల‌న్న ఆశ‌, కోరిక ప్ర‌తి ఒక్క‌రిలో క‌లిగించేలా త‌ను ప్ర‌య‌త్నం చేశార‌ని పేర్కొన్నారు కేజ్రీవాల్.

ఇవాళ ఈ దేశంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని అన్నారు. ఆనాటి ఎమ‌ర్జెన్సీ కంటే ఈనాడు మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం క‌నిపించ‌కుండా ఎమ‌ర్జెన్సీని విధించింద‌ని ఆరోపించారు . దీనిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డంలో , కోర్టును , న్యాయ‌మూర్తుల‌ను ఒప్పించ‌డంలో డాక్ట‌ర్ అభిషేక్ సింఘ్వీ సక్సెస్ అయ్యార‌ని కొనియాడారు సీఎం.

అందుకే తాను అభినందించేందుకు ఇక్క‌డికి వ‌చ్చాన‌ని చెప్పారు. సింఘ్వీతో భేటీ అనంత‌రం సీఎం మీడియాతో మాట్లాడారు. .