బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
చేరుకున్న సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం సంచలన ప్రకటన చేశారు. తాను , తన పరివారంతో కలిసి బీజేపీ కార్యాలయంకు వస్తానని ప్రకటించారు. మీ ఇష్టం వచ్చినట్లు ఎంత మందిని అదుపులోకి తీసుకుంటారో తీసుకోండి అంటూ సవాల్ విసిరారు. తాను ఎక్కడికీ వెళ్ల లేదని, పారిపోయే వాడిని కానంటూ ప్రకటించారు. దమ్ముంటే మరోసారి తనతో పాటు తన పరివారాన్ని కూడా అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరారు.
దీంతో బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ఆప్ కు కూటమి లోని ఇతర పార్టీలకు చెందిన వారు కూడా మద్తుగా నిలిచారు.
మోడీజీ తామంతా మీ ఆఫీసు వద్దకే వస్తున్నామని, భయపడాల్సిన పని లేదని, వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో, ఎవరిని ఎగ దోస్తున్నారో, ఎవరు అక్రమ కేసులు బనాయిస్తున్నారో ప్రజలందరికీ తెలుస్నారు కేజ్రీవాల్.