హర్యానాలో ఆప్ కు తిరుగు లేదు – కేజ్రీవాల్
భారతీయ జనతా పార్టీని ఊడ్చేస్తామని కామెంట్
హర్యానా – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ ను ఏకి పారేశారు. ఆప్ అధికారంలోకి రావడం పక్కా అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా రాష్ట్రంలోని మెహమ్ శాసన సభ నియోజకవర్గంలో పర్యటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పటి దాకా బీజేపీ కల్లగొల్లి కబుర్లతో కాలం గడిపిందని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించు కోవడం లేదని ఆవేదన చెందారు.
కానీ ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆప్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. నా స్వస్థం ఈ రాష్ట్రం. కానీ ఇక్కడి నుంచి తాను ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని, ఆ తర్వాత పంజాబ్ కు విస్తరించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం హర్యానాలో పాగా వేయడం ఖాయమని , ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు మాజీ సీఎం, ఆప్ బాస్. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ స్వస్థలం హర్యానా రాష్ట్రం. స్వంత ఊరు భివానీలో నిర్వహించిన సభలో ప్రసంగించడం విశేషం.