జైలు నుంచే పరిపాలన – సీఎం
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయనను ఢిల్లీలోని హైకోర్టులో హాజరు పర్చింది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించారంటూ పేర్కొంది.
ఇప్పటి దాకా ఈ కేసులో రూ. 100 కోట్లు చేతులు మారాయని చెప్పామని, కానీ తీగ లాగితే డొంకంతా కలిగిందని పేర్కొంది. ఏకంగా రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీనిని హవాలా రూపంలో మార్చారంటూ సంచలన ఆరోపణలు చేసింది కోర్టులో ఈడీ.
ఇదిలా ఉండగా దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల చరిత్రలో ఇప్పటి వరకు సీఎంను అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవడం విశేషం. అధికారంలో ఉండగా సీఎంగా ఉండడం ఇదే మొదటిసారి.
కోర్టుకు హాజరయ్యే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. తాను జైలు నుంచే పరిపాలన సాగిస్తానని స్పష్టం చేశారు. కోర్టు ప్రాంగణంలో తాను చెరసాలలో ఉన్నా బయట ఉన్నా తన జీవితం దేశానికే అంకితం అని ప్రకటించారు.