NEWSNATIONAL

ప్ర‌జాస్వామ్యాన్ని జైల్లో పెట్ట‌లేరు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన అర‌వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు బెయిల్ పై విడుద‌ల అయ్యారు. ఈ సంద‌ర్బంగా దేశ రాజ‌ధానిలో భారీ ఎత్తున భార‌తీయ కూట‌మి ఆధ్వ‌ర్యంలో సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అర‌వింద్ కేజ్రీవాల్. ప్ర‌జాస్వామ్యాన్ని జైల్లో పెట్టాల‌ని అనుకోవ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. ఈ విష‌యం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో తేల‌డం ఖాయ‌మ‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నియంతృత్వ ధోర‌ణికి కాలం చెల్లింద‌న్నారు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో తానే సుప్రీం అని అనుకున్న వాళ్లంతా ఓట‌మి పాల‌య్యార‌ని, చ‌రిత్ర‌లో మిగ‌ల లేద‌న్న విష‌యం గుర్తించాల‌న్నారు.

జైలు నుండి ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా న‌డపాలో చూపిస్తామ‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్. తాను ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో క‌మిష‌న‌ర్ గా ప‌ని చేశాన‌ని చెప్పారు. అది వ‌దిలేసి మురికి వాడ‌ల్లో ప‌ని చేశాన‌ని అన్నారు. తొలి సారి సీఎం అయ్యాక నా సిద్దాంతాల మేర‌కు వ‌దిలేశాన‌ని పేర్కొన్నారు. ఏది ఏమైనా మోదీ, బీజేపీ ప‌రివారం తెలుసు కోవాల్సింది ఏమిటంటే డెమోక్ర‌సీని జైల్లో బంధించ లేర‌న్నారు.